ధర్మవరం సిపిఐ నాయకులు యుద్ధం పేరుతో కొందరు వ్యాపారులు నిత్యవసర వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ధర్మవరం ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. నియోజకవర్గ సిపిఐ నాయకుడు మధు మాట్లాడుతూ, యుద్ధం పేరు చెప్పి గ్యాస్, నిత్యవసర వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.