ధర్మవరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. ఈ శిబిరానికి సంబంధించిన కరపత్రాలను బుధవారం రోటరీ క్లబ్‌లో విడుదల చేశారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కోటా ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ వైద్య శిబిరం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.