ధర్మవరం ప్రభుత్వ బిఎస్సార్ బాలికోన్నత పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థినులు ఐఐటీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ధర్మవరం
బీజేపీ నేత హరీష్ బాబు విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ సూచనల మేరకు హైదరాబాద్‌కు చెందిన అభిరాం ఐఏఎస్ అకాడమీ ద్వారా ఈ విద్యార్థినులకు యూపీఎస్సీలో ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నట్లు హరీష్ బాబు తెలిపారు. ఈ విజయం విద్యార్థుల కృషికి, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహానికి నిదర్శనం.