ధర్మవరంలో IDFC బ్యాంకు ఏటీఎం ఎత్తుకెళ్లిన దొంగలు

5చూసినవారు
ధర్మవరం పట్టణంలో తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. పుట్టపర్తి వెళ్లే రోడ్డులోని ఐడిఎఫ్సి బ్యాంకు ఏటీఎం మిషన్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. డబ్బు దొంగిలించే ప్రయత్నం విఫలం కావడంతో ఏకంగా మిషన్ నే ఎత్తుకెళ్లినట్లు సమాచారం. స్థానికులు గమనించి కేకలు వేయడంతో, దొంగలు బొలెరో వాహనంలో పరారైనట్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.