గుడిలో దొంగతనాలు చేస్తున్న ముగ్గురి అరెస్ట్

11చూసినవారు
శనివారం ధర్మవరం రూలర్ పరిధిలోని గ్రామాలలో గుడి దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూలర్ ఎస్ఐ పి. శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, చిగుచెర్ల వీరముద్రయ్య స్వామి గుడి, గొట్లూరు మహంకాలమ్మ గుడి, పెద్దమ్మ గుడి, రాంపురం సత్యమ్మ గుడిలలో ఈ దొంగతనాలు జరిగాయి. నిందితుల వద్ద నుంచి సుమారు 340 గ్రాముల బరువున్న 30 వెండి గొడుగులు, 3 గ్రాముల బంగారు తాళిబొట్లు 2 స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్