Mar 17, 2026, 03:03 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
సాగు నీటి విడుదలతో నిజాంసాగర్‌లో తగ్గుతున్న నీటిమట్టం
Mar 17, 2026, 03:03 IST
ఉమ్మడి కామారెడ్డి - నిజామాబాద్ జిల్లాల పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. మంగళవారం ఉదయం నాటికి 1405 అడుగుల సామర్థ్యం గల జలాశయంలో 1399.75 అడుగుల నీరు ఉందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రధాన కాల్వ ద్వారా ఆయకట్టు రైతులకు 2వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండటంతో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది రబీలో ఆయకట్టు రైతులకు సాగునీరు పుష్కలంగా అందింది.