
అసభ్య పోస్టులు పెడుతున్న వారి పై చర్యలు తీసుకోండి: వైసీపీ
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అక్రమ అరెస్టులు చేస్తున్నారని, జర్నలిస్ట్ పూడి శ్రీహరి అరెస్ట్ ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ సోషల్ మీడియా నేతలు అబ్దుల్ బాసిద్, రమేశ్ గౌడ్ మండిపడ్డారు. వైఎస్ భారతీ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన M9 News, Think Andhra సంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






































