గుత్తి మోడల్ స్కూల్లో పదో తరగతి టాపర్లకు గురువారం సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ కుమారి, స్కూల్ ఛైర్మన్ పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అత్యధిక మార్కులు సాధించిన హర్షిత, తన్విన్, లిఖిత, హర్షవర్ధన్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.