గుత్తిలో గ్యాస్ కొరత లేదని, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం గుత్తి సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మూడు వారాల్లోనే గ్యాస్ ఏజెన్సీలు 19 వేల సిలిండర్లు పంపిణీ చేశాయని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను గ్యాస్ కొరతకు ముడిపెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.