సోమవారం గుత్తి పట్టణంలో మట్కా స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. సీఐ రామారావు ఆదేశాల మేరకు, మట్కా రాస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 52,000 నగదుతో పాటు మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.