గుత్తిలో అర్ధరాత్రి ఆటోపై దాడి: అద్దాలు ధ్వంసం, పోలీసుల విచారణ

7చూసినవారు
గుత్తి ఆర్ఎస్ పరిధిలోని రవుఫ్ మఖాన్ కాలనీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్మాయిల్ అనే వ్యక్తికి చెందిన ఆటోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా నష్టపోయాడు. కాలనీకి చెందిన కొందరు తాగుబోతులు ఈ దాడికి పాల్పడి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.