గుత్తి మండలం కొత్తపేట సమీపంలోని నర్సరీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి వచ్చిన బంతిని తీసుకుంటున్న తనూజ్ అనే బాలుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తనూజ్ తీవ్రంగా గాయపడటంతో, కుటుంబ సభ్యులు అతన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.