గుంతకల్లులోని మమ్మీ డాడీ వస్త్ర దుకాణంలో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు షాపు అంతటా వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.