గుంతకల్లు: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

8చూసినవారు
గుంతకల్లు: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
శుక్రవారం, ఎన్.నరసాపురం గ్రామానికి చెందిన కె. సావిత్రి (45) అనే మహిళ జాతీయ రహదారి పక్కన ఆటో కోసం ఎదురుచూస్తుండగా, గుంతకల్లు నుంచి అనంతపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. పొదుపు సంఘం సభ్యులతో కలిసి బ్యాంకుకు వెళ్లడానికి వచ్చిన ఆమె, రోడ్డు పక్కన కూర్చుని ఉండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్‌ను అడ్డుకున్నారు. గ్రామీణ సీఐ, ఎస్సై ప్రమాదస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత పోస్ట్