గుత్తి పట్టణంలోని చెర్లోపల్లి కాలనీలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం హోటల్ చంద్ర అనే వ్యక్తికి చెందిన పాత ఇంటి పైకప్పు కూలిపోయింది. అదృష్టవశాత్తు, పైకప్పు కూలిన సమయంలో ఇంట్లో ఉన్నవారు అప్రమత్తమై వెంటనే బయటికి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాధితుడు చంద్ర కోరారు.