గుత్తి పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో యాడికి మండల సర్వేయర్ సుంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. సుంకన్న బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడ్డాడు. హైవే పెట్రోల్ పోలీసులు గమనించి సుంకన్నను గుత్తి ఆస్పత్రికి తరలించారు. అనంతరం అనంతపురానికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.