గుత్తి: క్రైమ్ కు పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి

1864చూసినవారు
గుత్తిలో సెల్ ఫోన్ తస్కరించి అందులో ఉన్న రూ. 30 వేలను ఫోన్ పే ద్వారా తన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకున్న వ్యక్తికి బుధవారం ప్రజలు దేహశుద్ధి చేశారు. ప్యాపిలికి చెందిన రాజు అనే వ్యక్తి గుత్తిలో తన బంధువుల వద్దకు వచ్చాడు. చంద్ర అనే వ్యక్తికి చెందిన సెల్ ఫోను తస్కరించాడు. అందులో ఉన్న డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులు రాజును కట్టేసి దేహశుద్ధి చేశారు.

సంబంధిత పోస్ట్