గుత్తి మండలం పూలకుంట సమీపంలో మంగళవారం కంకర మిషన్ వద్ద శివలింగయ్య తన భార్య లక్ష్మీని వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రాళ్లతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై సీఐ రామారావు, ఎస్ఐ సురేశ్ విచారణ చేపట్టారు. గుత్తి శివారులోని లచ్చానపల్లి రోడ్డులో శివలింగయ్యను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు.