మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుద్దాం- మంత్రి సవిత

9చూసినవారు
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుద్దాం- మంత్రి సవిత
జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా గుత్తి పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి సవిత పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి కాలంలో గాంధీ సిద్ధాంతాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :