విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

0చూసినవారు
గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో సోమవారం ఒక లారీ డివైడర్ల మధ్యలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే మున్సిపాలిటీ లైటింగ్ సిబ్బంది రోడ్డుపై పడిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించారు. పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్