గుంతకల్లులోని వెజిటేబుల్ మార్కెట్ కబేళా లైన్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మద్యం ఎక్కువగా తాగడం వల్లే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మనోహర్ తెలిపారు.