గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుంతకల్లు మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గుంతకల్లు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ, అవ్వ తాతలకు అండగా ఉండేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని 3000 నుండి 4000కు పెంచారని, గెలిచిన వెంటనే ఈ హామీని నెరవేర్చారని తెలిపారు.