గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలోని 22వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొని వృద్ధులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.