గుత్తిలో ఎమ్మెల్యే తనయుడి జన్మదిన వేడుకలు: టీడీపీ నాయకుల ఘన సన్మానం

3చూసినవారు
గుత్తిలో శనివారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు, గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ నాయకులు గాంధీ చౌక్ లో గజమాలతో సత్కరించారు. అనంతరం స్పందన ఫంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బసినేపల్లి టీడీపీ నాయకులు రామంజి, తలారి నాగరాజు, స్టోర్ డీలర్ సుమన్, సుంకన్న, విద్యా కమిటీ చైర్మన్ షే క్షావలి, బూతు ఇంచార్జ్ నారాయణస్వామి గజమాలతో సత్కరించారు. అనంతరం డాన్సులు వేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చి, స్పందన ఫంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్