మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి వివిధ క్లస్టర్లలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కసాపురం గ్రామం, గుంతకల్ పట్టణం (వాసవి టాకీస్), నామాల సేటు కళ్యాణమండపం, నాగ సముద్రం గ్రామం నందు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.