గుంతకల్లు లో ఆటో బోల్తా పడి ఒకరి మృతి

3చూసినవారు
గుంతకల్లు లో ఆటో బోల్తా పడి ఒకరి మృతి
శనివారం గుంతకల్లు మండలం తిమ్మాపురం సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పెద్దపుల్లన్న అనే వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుంతకల్లు-గుత్తి జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారిని గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్