ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ రామారావు

8చూసినవారు
ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ రామారావు
గుత్తి బస్టాండ్‌లో ప్రయాణికులు తమ సామగ్రి, బంగారు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఐ రామారావు సూచించారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు, నీళ్లు తీసుకోవద్దని హెచ్చరించారు. బస్టాండ్ పరిసరాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.