గుంతకల్లులో రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం జరిగింది. డీఎస్పీ ఎ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మత పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడాలని, మత సామరస్యాన్ని పెంపొందించాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐలు మనోహర్, వంశీకృష్ణ, ప్రవీణ్ కుమార్ లు కూడా పాల్గొన్నారు. పట్టణ, మండల పరిధిలోని ముస్లిం, హిందూ, క్రైస్తవ మత పెద్దలతో పండుగ ఏర్పాట్లు, శాంతిభద్రతలపై చర్చించారు.