గుత్తిలో రోడ్డు ప్రమాదం... ఓ వ్యక్తి కి తీవ్ర గాయాలు

4451చూసినవారు
గుత్తిలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌పై కాలేజీకి వెళ్తున్న ఇంటర్ విద్యార్థి సందీప్‌ను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ కాళ్లు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్, స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.