గుత్తిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తప్పిన ప్రమాదం

1919చూసినవారు
గుత్తిలోని ఆదర్శ స్కూల్ నంబర్ 2 ప్రాథమిక పాఠశాలలో తరగతి గది పైకప్పు మంగళవారం పెచ్చులూడి కిందపడటంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని హెచ్ఎం వీరాచారి తెలిపారు. అదృష్టవశాత్తు అందరూ క్షేమంగా బయటపడ్డారు.