గుత్తి లో సరోజిని నాయుడు 77వ వర్ధంతి కార్య క్రమం

5చూసినవారు
గుత్తి లో సరోజిని నాయుడు 77వ వర్ధంతి కార్య క్రమం
గుత్తి పెన్షన్ భవనంలో సోమవారం సరోజిని నాయుడు 77వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కోశాధికారి జెన్నే కుల్లాయి బాబు, సెక్రెటరీ రామ్ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు సరోజిని నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాయింట్ సెక్రెటరీ లక్ష్మి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, సరోజిని నాయుడు స్వాతంత్ర్య సమర యోధురాలుగా, 'నైటింగల్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ధి చెందారని, ఆమె ఒక కవయిత్రి అని తెలిపారు. సరోజిని దేవి 1925 డిసెంబర్ లో కాన్పూర్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహా సభలకు తొలి మహిళా అధ్యక్షురాలని ఆయన పేర్కొన్నారు.