2026 ఏప్రిల్ 27, సోమవారం ఉదయం గుంతకల్ పట్టణంలో ఆర్డీవో కార్యాలయంలో, గుంతకల్ ఆర్డీవో ఏబీవీఎస్బీ శ్రీనివాస్‌ను గుంతకల్ రెవిన్యూ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎస్. హరిప్రసాద్ యాదవ్ కలిసి వినతి పత్రం అందజేశారు. ధోని ముక్కల రోడ్డు, ఇందిరమ్మ కాలనీ, టిడ్కో బిల్డింగుల సమీపంలో నివాసముంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు వీధి దీపాలు, డ్రైనేజీ, మంచినీళ్లు, సిమెంట్ రోడ్లు వంటి కనీస వసతులు లేవని, పారిశుద్ధ్యం కూడా అధ్వాన్నంగా ఉందని ఆయన తెలిపారు. దీనివల్ల చాలామంది ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ, వాటిలో నివాసం ఉండటానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు.