కలెక్టర్ పాఠాలు బోధించారు, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు

5చూసినవారు
గుంతకల్లు పట్టణంలోని డా.సరోజినీ నాయుడు పురపాలక ఉన్నత పాఠశాల (బాలికల)ను బుధవారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, విద్యార్థులతో భోజనం నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పదవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆర్ టి ఓ శ్రీనివాసులు, తాసిల్దార్ రమాదేవి, పాఠశాల హెచ్ ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్