పామిడి భోగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ ఘనంగా జరిగింది

2051చూసినవారు
పామిడి భోగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ ఘనంగా జరిగింది
అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని పామిడిలో భోగేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం అనంతరం కుంభాభిషేకం, పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. హంపి వీరుపాక్ష విద్యారణ్య మహా సంస్తానం పిఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతి ఈ కార్యక్రమాలను నిర్వహించారు. దేవగుడి సురేష్ ప్రతిష్ఠ తంతును భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, ద్వజ ప్రతిష్ఠ, సూర్య భగవానుని విగ్రహ, నాగుల విగ్రహాల ప్రతిష్ఠ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ మండల ఇంచార్జి ఈశ్వర్, కార్మిక సంక్షేమ బోర్డు అధ్యక్షులు వెంకట శివుడు, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, దేవాదాయ శాఖ ఏసీ మల్లికార్జున, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్