గుత్తి లో రూ. 6 లక్షల చోరీ చేసిన దొంగలు

7చూసినవారు
శనివారం గుత్తిలోని బీసీ కాలనీకి చెందిన ఓబులేశ్ రెడ్డి తన స్కూటీ డిక్కీలో పెట్టిన రూ. 6 లక్షలు చోరీకి గురయ్యాయి. అప్పు కట్టేందుకు రూ. 6లక్షలు తీసుకొని వెళ్తూ మధ్యలో అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లానని, దైవదర్శనం చేసుకుని బయటికి వచ్చి చూడగా స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి ఉండటాన్ని గమనించానని బాధితుడు ఓబులేశ్ రెడ్డి తెలిపారు. స్కూటీ వద్దకు వెళ్లి చూడగా డబ్బు కనిపించలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్