గుంతకల్లు నుంచి ప్రయాణించనున్న తిరుమల ఎక్స్ప్రెస్

6చూసినవారు
గుంతకల్లు నుంచి ప్రయాణించనున్న తిరుమల ఎక్స్ప్రెస్
అనంతపురం జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కృషితో తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను గుంతకల్లు వరకు విస్తరించారు. మే 12వ తేదీన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ విస్తరణతో వైజాగ్ వెళ్లే అనంతపురం, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులభతరం కానుంది.