అనంత జిల్లాలో రెండు బస్సులు ఢీ

3చూసినవారు
అనంత జిల్లాలో రెండు బస్సులు ఢీ
గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయినప్పుడు వెనుక నుంచి మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. బస్సులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్