గుత్తి పట్టణ శివారులోని తాడిపత్రి రోడ్డులో గురువారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.