గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలోని స్పందన ఫంక్షన్ హాల్‌లో, గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ టి జి భరత్, అనంతపురం జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ పూల నాగరాజు, ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం, ఆయన సోదరులు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి, మరియు గుత్తి, పామిడి ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశం నియోజకవర్గ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించబడింది.