గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం, భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదన్న కోపంతో మహాలక్ష్మి అనే మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత మూడు రోజులుగా భర్త హరికృష్ణ సిలిండర్ కోసం గుత్తికి వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వస్తుండటంతో మనస్థాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.