గుత్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన రాధిక అనే మహిళ మంగళవారం కుటుంబ కలహాల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.