ఇంటి స్థలాల కోసం మహిళల ధర్నా: అధికారులకు వినతి

11చూసినవారు
గుత్తిలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఇంటి స్థలాలు లేని మహిళలు ఎర్రటి ఎండలో నిరసన తెలిపారు. గత కొన్నేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ పుణ్యవతి మాట్లాడుతూ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిరసన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్