Feb 09, 2026, 09:02 IST/
రైతులకు గుడ్న్యూస్.. రేపు అకౌంట్లోకి 'రైతు భరోసా' డబ్బులు?
Feb 09, 2026, 09:02 IST
TG: మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతులకు 'రైతు భరోసా' పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధుల సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ.9వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం RBIకి ఇండెంటు పెట్టినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు ఈ మొత్తం రుణాలు అందితే ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ నిధులు ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. అనంతరం ప్రభుత్వం ఈ సోమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.