Mar 08, 2026, 12:03 IST/
VIDEO: విద్యార్థినులపై డాక్టర్ లైంగిక వేధింపులు
Mar 08, 2026, 12:03 IST
లక్నోలోని ప్రతిష్టాత్మక డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RMLIMS) లో దారుణం వెలుగుచూసింది. చికిత్స కోసం వచ్చిన విద్యార్థినుల పట్ల ఒక డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిపై దాడికి తెగబడ్డాడు. తప్పుడు పద్ధతిలో ఇంజెక్షన్ వేయడాన్ని నిరసించినందుకు సదరు డాక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ చౌకీకి వెళ్లగా, అక్కడ నిందితుడు పోలీసులతో కలిసి సరదాగా టీ తాగుతూ కనిపించడం అందరినీ విస్మయానికి గురిచేసింది