Mar 14, 2026, 11:03 IST/
బావి పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి ముగ్గురు మృతి
Mar 14, 2026, 11:03 IST
TG: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బావి పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగిపడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.