సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం బాగేపల్లి సుంకులమ్మ దేవాలయం సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో బాగేపల్లికి చెందిన ఉమాదేవి (55), విజ్ఞ (40), లక్ష్మమ్మ (50), సరోజమ్మ, ఆటో డ్రైవర్ ఆంజినప్ప (35) అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరొకరు కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.