హిందూపూర్ లో ఇటీవల జరిగిన బ్యాంకు దోపిడీ కేసులో బీఎస్ఎఫ్ జవాన్ అనిల్ పవర్ తో పాటు మరో రాజస్థాన్ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. దొంగిలించబడిన బంగారు నగలను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు.