
మద్యం మత్తులో భార్య, పిల్లలను రోకలి బండతో కొట్టిన భర్త
TG: రంగారెడ్డి(D) ఆమనగల్లు(M)లో ఓ వ్యక్తి భార్య, పిల్లలపై రోకలి బండతో దాడి చేశాడు. సీతారాంనగర్ తండా పంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లితండాకు చెందిన బాణావత్ రాందాస్‌నాయక్, కవిత(28) దంపతులు. మద్యానికి బానిసైన రాందాస్‌నాయక్ సోమవారం రాత్రి కవితతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య కవిత, కుమార్తె ప్రణీత, కుమారుడు హర్షవర్ధన్ ను రోకలి బండతో కొట్టాడు. ఈ క్రమంలో కవిత, హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా, ప్రణీత ఆసుపత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.




