80 లక్షల వ్యయంతో కళ్యాణమండపం నిర్మాణం

12చూసినవారు
హిందూపురం పార్లమెంటు సభ్యుడు బి.కె. పార్థసారథి ఆదివారం సోమందేపల్లి మండల కేంద్రంలో ఎంపీ నిధులతో నిర్మిస్తున్న ఉప్పర, సగర కులస్తుల కళ్యాణ మండపం నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో ఈ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతోందని ఎంపీ తెలిపారు. కాంట్రాక్టర్లకు సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్