హిందూపురం గ్రామీణ మండలం తూముకుంట పారిశ్రామికవాడలో
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 13.20 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ వ్యవహారంపై అందిన సమాచారం మేరకు ప్రత్యేక బృందం దాడులు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవీ మహేశ్ వెల్లడించారు.